పది, ఐటీఐ చదివిన వారికి శుభవార్త.. బీఎస్‌ఎఫ్‌లో 1410 కానిస్టేబుల్ ఉద్యోగాలు..!
BSF Tradesman Recruitment 2023: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తన అధికారిక వెబ్‌సైట్ అంటే rectt.bsf.gov.inలో త్వరలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
BSF Tradesman Recruitment 2023: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తన అధికారిక వెబ్‌సైట్ అంటే rectt.bsf.gov.inలో త్వరలో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మొత్తం 1410 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 1343 పురుష అభ్యర్థులు, 67 మహిళా అభ్యర్థులకు ఉన్నాయి. అర్హులైన, ఆసక్తిగల భారతీయ పురుషులు, స్త్రీల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ నోటిఫికేషన్‌లో చెబుతారు. ఎంపికైన అభ్యర్థులు లెవల్ 3 ప్రకారం నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం పొందుతారు. బీఎస్‌ఎఫ్ ట్రేడ్స్‌మాన్ 2023 గురించి మరిన్ని వివరాలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు. అభ్యర్థులు ఐటీఐ, 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సును కలిగి ఉండాలి. వయోపరిమితి గురించి చెప్పాలంటే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. BSF అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ప్రాథమిక సమాచారాన్ని అంటే పేరు, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ IDని ఉపయోగించి పేరు నమోదు చేసుకోవాలి.
2. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత సైట్‌లోకి లాగిన్ అయి 'ఆన్‌లైన్ అప్లికేషన్' లింక్ నుంచి నోటిఫికేషన్ చూడవచ్చు.
3. ఇప్పుడు 'అప్లై హియర్' లింక్‌పై క్లిక్ చేయాలి.
4. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సంబంధిత సమాచారాన్ని నింపాలి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
5. మొత్తం సమాచారాన్ని నింపిన తర్వాత దరఖాస్తు ఫారమ్ పూర్తి ప్రివ్యూను చూడవచ్చు. ఏవైనా తప్పు చేసినట్లయితే బ్యాక్ ఆప్షన్ ఉపయోగించి వెనకకు వెళ్లాలి. ఎందుకంటే ఒక్కసారి ఓకే బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్‌లో ఎలాంటి మార్పులు చేయలేరని గుర్తుంచుకోండి.