BHEL Recruitment 2023: ఇంజనీరింగ్‌ చేసిన వారికి గుడ్‌న్యూస్‌.. రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..

BHEL Recruitment 2023: బీటెక్‌, బీఈ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులు చేసిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి.

Update: 2023-04-05 06:16 GMT

BHEL Recruitment 2023: ఇంజనీరింగ్‌ చేసిన వారికి గుడ్‌న్యూస్‌.. రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..

BHEL Recruitment 2023: బీటెక్‌, బీఈ వంటి ఇంజినీరింగ్‌ కోర్సులు చేసిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి. భారత ప్రభుత్వానికి చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) నుంచి నోటిఫికేషన్‌ను విడుదల అయింది. బెంగళూరులో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

అభ్యర్ధుల ఎంపికకకు సంబంధించి పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. జీతభత్యాలుగా నెలకు 43,550 చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు పంపేందుకు చివరి తేది 29 ఏప్రిల్ 2023గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తులకు మే 6, 2023 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bhel.com/ పరిశీలించగలరు.

Tags:    

Similar News