BECIL Recruitment 2023: నిరుద్యోగులకి అలర్ట్‌.. BECILలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు..!

BECIL Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఇది శుభవార్తని చెప్పాలి.

Update: 2023-04-01 05:33 GMT

BECIL Recruitment 2023: నిరుద్యోగులకి అలర్ట్‌.. BECILలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు..!

BECIL Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఇది శుభవార్తని చెప్పాలి. బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో DEO, రేడియోగ్రాఫర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా అనేక పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన యువత అధికారిక వెబ్‌సైట్‌ becil.comని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. వీటికి ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోండి.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 155 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12గా నిర్ణయించారు. అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి సంబంధిత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రతి సమాచారం తెలుసుకోవచ్చు. యువకుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఇందులో స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ఉంటాయి. ఈ మూడు దశలు దాటినవారిని ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారు. రిక్రూట్‌మెంట్ సంబంధిత సమాచారం ఇమెయిల్, టెలిఫోన్ ద్వారా అందిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్: 50 పోస్టులు

పేషెంట్ కేర్ మేనేజర్ (PCM): 10 పోస్టులు

పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 25 పోస్టులు

రేడియోగ్రాఫర్: 50 పోస్టులు

మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్: 20 పోస్టులు

దరఖాస్తు రుసుము ఎంత?

జనరల్: రూ.885 (అదనపు ప్రతి పోస్టుకు రూ.590)

OBC: రూ.885 (అదనపు ప్రతి పోస్టుకు రూ.590)

SC/ST: రూ. 531 (అదనపు ప్రతి పోస్టుకు రూ. 354)

ఎక్స్-సర్వీస్‌మెన్: రూ. 885 (అదనపు ప్రతి పోస్టుకు రూ. 590)

మహిళా అభ్యర్థులు: రూ.885 (అదనపు ప్రతి పోస్టుకు రూ.590)

EWS/దివ్యాంగ్: రూ. 531 (అదనపు ప్రతి పోస్టుకు రూ. 354)

Tags:    

Similar News