ఆర్మీలో చేరాలనే నిరుద్యోగులకి శుభవార్త.. ఇప్పుడు అగ్నివీర్‌లో మరిన్ని మార్పులు..!

Agniveer Bharti 2023: ఇండియన్‌ ఆర్మీలో చేరాలనే నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. 50 శాతం అగ్నివీర్లకు త్వరలో శాశ్వత కేడర్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తారని సమాచారం.

Update: 2023-07-11 15:00 GMT

ఆర్మీలో చేరాలనే నిరుద్యోగులకి శుభవార్త.. ఇప్పుడు అగ్నివీర్‌లో మరిన్ని మార్పులు..!

Agniveer Bharti 2023: ఇండియన్‌ ఆర్మీలో చేరాలనే నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. 50 శాతం అగ్నివీర్లకు త్వరలో శాశ్వత కేడర్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ అంశాన్ని సైన్యం పరిశీలిస్తోంది. దీంతో త్వరలో భారత ఆర్మీలో సైనికుల కొరత తీరనుంది. అగ్నిపథ్ పథకం కింద ప్రస్తుత నిబంధన ప్రకారం 25 శాతం అగ్నివీరులను మాత్రమే శాశ్వత కేడర్‌లో చేర్చుతున్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే దాదాపు చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగ భద్రత లభిస్తుంది.

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సైన్యం రెండు బ్యాచ్‌లలో 40,000 అగ్నివీర్లను చేర్చింది. మొదటి బ్యాచ్‌ను డిసెంబర్ నాటికి, రెండవ బ్యాచ్ ఫిబ్రవరి 2023 నాటికి పూర్తిచేసింది. సైనికులు, నావికులు, ఎయిర్‌మెన్‌ల నియామకం ఇప్పుడు అగ్నిపథ్ పథకం కింద జరుగుతున్న సంగతి తెలిసిందే. మీడియా కథనాల ప్రకారం 50 శాతం అగ్నివీర్లను శాశ్వత కేడర్‌లో చేర్చే విషయం పరిశీలనలో ఉందని అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒక ఆర్మీ ఉన్నత అధికారి ప్రకారం కోవిడ్ -19 కాలంలో ఎటువంటి రిక్రూట్‌మెంట్ జరగలేదని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు.

ప్రతి సంవత్సరం సుమారు 60,000 మంది సైనికులు సైన్యం నుంచి రిటైర్మెంట్‌ అవుతున్నారు. 14 జూన్ 2022న ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు పనిచేసేందుకు సైనికుల నియామకం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వయోపరిమితిని పదిహేడున్నర నుంచి 21 సంవత్సరాలుగా నిర్ణయించింది. 2026 నాటికి మొత్తం 1.75 లక్షల మంది అగ్నివీర్లని నియమించాల్సి ఉంది. ఇందులో 25 శాతం అగ్నివీరులను మాత్రమే పర్మినెంట్ క్యాడర్‌లో చేర్చాలి. దీన్ని 50 శాతానికి పెంచాలని ప్రస్తుతం భారత సైన్యం పరిశీలిస్తోంది. సైన్యంలో అగ్నివీర్ కింద టెక్నికల్ రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితిని పెంచవచ్చు. 21 నుంచి 23 ఏళ్లకు పెంచే ఆలోచన ఉంది.

Tags:    

Similar News