ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న దృశ్యాలు చిత్రీకరించిన విద్యార్ధి!
ఆంధ్రాకి చెందిన ఓ విద్యార్ధి చదుపు చేప్పే ప్రొఫెసర్‌నే బెదిరించి నగ్న దృశ్యాలు చిత్రీకరించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆంధ్రాకి చెందిన వివేశ్ కాంచీపురంలో జిల్లాలోని మహాబలిపురం ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివేశ్ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ఆంధ్రాకి చెందిన ఓ విద్యార్ధి చదుపు చేప్పే ప్రొఫెసర్‌నే బెదిరించి నగ్న దృశ్యాలు చిత్రీకరించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళితే... . ఆంధ్రాకి చెందిన వివేశ్ కాంచీపురంలో జిల్లాలోని మహాబలిపురం ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివేశ్ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్తో ప్రొఫెసర్ స్నేహంగా మెలిగారు.
అయితే ఈనెల 19వ తేదీ వివేశ్ తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని తెలిపి ప్రొఫెసర్‌ను పిలిచాడు.ఇందుకు ప్రొఫెసర్ అంగీకరించింది. రాత్రి 7 గంటల సమయంలో షోలింగ నల్లూర్‌లో ప్రొఫెసర్ ఉంటున్న హాస్టల్‌కు వివేశ్ వెళ్లాడు. ఆమెను తన బైకులో ఎక్కించుకుని ఈస్ట్ కోస్ట్ రోడ్డుకు తీసుకెళ్లాడు. పూంజేరి సమీపంలో ఒక గదిలో వాహనాన్ని ఆపాడు. దీంతో భయపడిన ప్రొఫెసర్ ఎందుకు ఆపావని ప్రశ్నించగా.. లోపల రిసార్ట్ ఉందని, అక్కడ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. తర్వాత పొదలు చోటుకు ఆమెను తీసుకెళ్లి కత్తి చూపి డ్రస్ విప్పమని బెదిరించాడు. భయపడిపోయిన ప్రొఫెసర్ నగ్న వీడియోలను చిత్రికరించాడు. అనంతరం తనతో గడపాలని లేకుంటే నగ్నంగా ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమల్లో పెడతానని బెదించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివేశ్ ను అరెస్టు చేశారు. వివేశ్ చిత్రికరించిన నగ్న వీడియోలు తొలిగించారు.