సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలతో... భార్యకు నరకం చూపించిన భర్త

Update: 2019-07-29 07:12 GMT

పచ్చటి పెళ్లి పందిరిలో మూడుముళ్లు వేసి.. తనతో ఏడు అడుగులు నడిచిన భర్త.. ఏడుజన్మల వరకు తనకు తోడు.. నీడగా ఉంటాడని ప్రతీ భార్య ఆశిస్తుంది. కానీ.. ఇక్కడ అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న ఓ భర్త మాత్రం తనపాలిటి యముడిలా మారాడు. తన పైశాచికత్వమంతా కట్టుకున్న భార్యపై ప్రదర్శించి ప్రత్యక్ష నరకం చూపాడు. ఈ ఘటన బంజారాహిల్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. అశ్లీల వీడియోలు చూపి వాటిలో ఎలా ఉందో అలానే కోరికలు తీర్చాలని, ప్రతిరోజూ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఓ భర్తపై భార్య పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఇక బంజారాహిల్స్‌ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళ(33)కు రఘు(35) అనే వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే భర్త వేధింపులు స్టార్ట్ అయ్యాయి. భార్య ఓ ప్రైవేటు సంస్థలో కొలువు చేస్తుంది. భర్యకు వచ్చిన జీతంతో పాటు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు తను దాచుకున్న డబ్బులన్నింటిని భర్త బలవంతంగా తీసుకున్నాడు. భార్య తల్లిదండ్రులకు మద్దతిస్తే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.

కాగా గత కొద్ది రోజులుగా భర్త పెట్టే టార్చర్ ఎక్కవ అయిపోయింది. భర్త ఫోన్‌లో ఉన్న నీలిచిత్రాలు చూపిస్తూ ప్రకృతివిరుద్ధ లైంగిక చర్యలో పాల్గొనాలని భార్యను తీవ్ర వేధింపులకు దిగాడు. అందుకు ఏ మాత్రం కూడా ఆమె అంగికరించలేదు. నా మాటే కాదంటవా అంటూ తీవ్రకోపంతో రగిలిపోయిన భర్త.. భార్యని ఇష్టమెచ్చినట్లు చితకొట్టి.. తనకు వెంటనే విడాకులు కావాలంటూ బెదిరించాడు. భర్త చెప్పినట్లు భార్య వినాల్సిందేనని.. మరొకరి దగ్గరకు వెళ్లామని చెబితే వెళ్లాలి అంటూ రోజూ వేధించడం మొదలెట్టాడు. ఈ నెల 26న భార్యను కొట్టి బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. దీంతో బాధితురాలు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై 498(ఎ), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News