ఆమె అందం ఓ విషాదం. కష్టాలతోనే జీవన ప్రయాణం. చివరకు అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయిన వైనం. విశాఖ లో సంచలనం రేపిన ఓ దివ్య కథ ఇది. కన్నవారిని కడతేర్చారు. కట్టుకున్నవాడు వదిలేసి వెళ్లిపోయాడు. నమ్మినవాళ్లు నరహంతకులు అయ్యారు. ఇలా ఆమె ప్రయాణం మొత్తం ముళ్లబాటే.
విశాఖపట్నం లో అత్యంత ఘోరంగా హత్య కు గురైన దివ్య అనే యువతి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, రావుల పాలెం. దివ్య తండ్రి చిన్నప్పుడే ఆమె కుటుంబంను విడిచిపెట్టాడు. తల్లి, తమ్ముడుతో దివ్య అమ్మమ్మ ఇంట్లో ఆశ్రయం పొందారు. దివ్య తండ్రి దొంగతనం నేరాల్లో ఇరుక్కోవడం తో అతని స్నేహితుడు నల్ల మహారాజు తో వచ్చిన వివాదంలో దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్య కు గురయ్యారు. 2014 లో జరిగిన ఈ ఘటన లో ఇంకా మిస్టరీ గానే వుంది.
కుటుంబసభ్యుల హత్య తర్వాత నా అనేవారు లేక దివ్య పిన్ని క్రాంతి వేణి, బాబాయి సత్యనారాయణ వద్ద కొంతకాలం ఆశ్రయం పొందింది. తరువాత ఏలేశ్వరం కు చెందిన వ్యక్తి తో దివ్య వివాహం అయింది. అయితే కుటుంబ తగదాల నేపద్యంలో భర్త దివ్య కు దూరం అయ్యాడు. ఉపాధి వెతుక్కుంటూ దివ్య 8 నెలల క్రితం విశాఖపట్నం చేరుకుంది.
విశాఖ లో దివ్య కు వసంత అనే మహిళ పరిచయం అయింది. ఆర్ధిక అవసరాల కోసం దివ్యను వ్యభిచార వృత్తిలోకి దించింది. తన కన్నా ఎక్కువ సంపాదిస్తున్న దివ్య పై వసంత ఈర్ష్య పెంచుకుంది. దివ్యను వసంత, ఆమె సోదరి జ్యోతి, ఆమె భర్త కలిసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. దివ్య హత్య కేసు మాఫీకి ప్రయత్నించిన నిందితులు పోలీసులకు దొరికారు.
దివ్య హత్యతో ఆమె కుటుంబంలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి ఆమె పిన్ని క్రాంతి వేణి. పోలీసులు క్రాంతి వేణిని పోలీసులు విచారణ చేస్తున్నారు. దివ్య హత్యాకేసుతో పాటు కుటుంబ హత్యోందాలకు ఏమైనా లింకులు వున్నాయా, ఇంక ఎవరైనా వ్యక్తులు వున్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. దివ్య జీవన ప్రయాణంలో అన్ని ముళ్లబాటలే. చివరకు ఆమె ఆఖరి మజీలీ అత్యంత విషాదంగా ముగిసిపోయింది. పోలీసులు దర్యాప్తు తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం వుంది.