Katni GRP Brutality Video: దళితులపై పోలీసుల దాష్టీకం... వృద్ధ మహిళ, ఆమె మనుమడిని దారుణంగా కొట్టిన పోలీసులు... వైరల్ వీడియో

Katni GRP Brutality Video: మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లాలోని GRP పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. ఝరా తికురియాలో నివసిస్తున్న 15 ఏళ్ల దీపక్ అతని అమ్మమ్మ కుసుమ్ వంశ్‌కర్‌ను పోలీసు స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ రూమ్‌లో దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2024-08-29 03:43 GMT

Katni GRP Brutality Video: దళితులపై పోలీసుల దాష్టీకం.. వృద్ధ మహిళ, ఆమె మనుమడిని దారుణంగా కొట్టిన పోలీసులు.. వైరల్ వీడియో

Katni GRP Brutality Video:మధ్యప్రదేశ్‌లోని కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ వ్రుద్ద మహిళ, ఆమె మనవడిని దారణంగా కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దొంగతనం చేశారనే అనుమానంతో వృద్ధ మహిళ ఆమె, మనవడిని మహిళా పోలీసు కిరాతకంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో వైరల్ గా మారాయి. మొదట తలుపు మూసివేసి, ఆ మహిళను కర్రతో చితకబాదింది. దెబ్బలు తాళలేక బాధిత మహిళ నేలపై పడిపోయింది. ఆ తర్వాత మైనర్ బాలుడిని చితకబాదింది. తాము నేరం చేయలేదంటూ ఎంత చెప్పినా వినకుండా చావబాదింది. కొన్నాళ్లక్రితం జరిగిన ఈ ఘటనకు సంబధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సీఎం మోహన్ యాదవ్‌ను ప్రశ్నిస్తున్నారు.

వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ :

ఈ వీడియోను ఎంపీ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేసింది. వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు, ఎంపీ కాంగ్రెస్, ముఖ్యమంత్రి @DrMohanYadav51 జీ, మధ్యప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో చెప్పడానికి మీకు దమ్ముందా? శాంతిభద్రతల పేరుతో గూండాయిజం చేస్తూ మనుషులను చంపేందుకు మీ పోలీసులు పూనుకున్నారు. కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల చిన్నారి, అతని అమ్మమ్మను స్టేషన్‌ ఇన్‌చార్జి, పోలీసులు చితకబాదిన వీడియో చూస్తుంటే మనస్సు తరుక్కుపోతుంది. దొంగతనం నెపంతో ఇంతలా చితకబాదే రైట్స్ వీరికి ఎక్కడివి అంటూ ప్రశ్నించింది. మీ ఉదాసీనత వల్లనా? లేదా ఇలాంటి సిగ్గుమాలిన చర్యకు అనుమతి ఇచ్చారా? అంటూ ఫైర్ అయ్యింది.


అసలేం జరిగిందంటే?

దీపక్ అనే మైనర్ బాలుడిని దొంగతనం చేశాడన్న నెపంతో పోలీసులు...స్టేషన్ కు తరలించారు. తన మనవడి కోసం పోలీస్ స్టేషన్ వచ్చింది బాలుడి అమ్మమ్మ. మైనర్ బాలుడు దొంగతనం చేశాడని దీపక్, అతని అమ్మమ్మపై థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టారు. తాము ఎలాంటి దొంగతనం చేయలేదని చెప్పినా వినిపించుకోకుండా చావబాదారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు కట్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని, నిందితులైన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కట్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిజీత్ రంజన్ తెలిపారు.

Tags:    

Similar News