రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న వంశీ కేసులో కీలక మలుపు

Update: 2019-07-23 14:04 GMT

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో 2017 సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ వంశీ కేసు కీలక మలుపు తీసుకుంది. అతడు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా బయటపడింది. తొలుత మార్కులు తక్కువ వచ్చాయని వంశీ ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు భావించారు. ఆ తర్వాత వచ్చిన అనుమానాల నేపథ్యంలో తమ కుమారుడిని మాజీ జడ్పీటీసీ విద్యాసాగర్‌, శ్యామల కలిసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ సమయంలో జిల్లా ఎస్పీతో పాటు అప్పట్లో ప్రజాప్రతినిధులకు సైతం వంశీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో 2018 లో 306 సెక్షన్ కింద కేసుగా మార్చరు. అలా కేవలం కేసులో సెక్షన్ లు మార్చి చేతులు దులుపుకున్నారే తప్ప పోలీసులు నిందితులను విచారించలేదు. అయితే దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వంశీ మృతికి ముందు సెల్పీ వీడియో, కత్తితో కోసి చంపేశారంటూ తల్లికి పెట్టిన మేసేజ్ లు వెలుగులోకి రావడంతో అతడిది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికీ హత్యేననే అనుమానాలకు బల చేకూరినట్లు అవుతుంది.

తాను కాలేజికి వెళ్తుంటే విద్యాసాగర్ అతని మనుషులు, శ్యామల నన్ను వెంబడించారని వారి నుంచి తప్పించుకుని తోటలోకి పారిపోయి వచ్చానంటూ సెల్ఫీలో వంశీ చెప్పాడు. తనను చంపేస్తారనే భయంగా ఉందమ్మా అంటూ చివరి సారిగా తీసుకున్న సెల్ఫీ విడియోలో వంశీ చెప్పడం కేసును కీలక మలుపు తిప్పింది.

Full View 

Similar News