దళిత సర్పంచ్ పై దాడి ... కొబ్బరికాయ కొడతావా అంటూ ....

Update: 2019-08-23 11:44 GMT

రంగారెడ్డి : కులమతాల గొడవలు ఈ మధ్య బాగానే జరుగుతున్నాయి . నిన్న తమిళనాడులో ఓ దళితుడు మృతదేహాన్ని తమ పొలం వెంట తీసుకువెళ్ళడానికి వీలులేదని కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళు అడ్డుపడితే శవాన్ని బ్రిడ్జ్ పై నుండి కిందికి దించిన వైనాన్ని చూసాం . అది మరవక ముందే ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది . బోనాల సందర్భంగా కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళిన ఓ దళిత సర్పంచ్ పై కొందరు అగ్రవర్ణాల పెద్దలు దాడి చేసారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది . గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌ గా దళిత సామాజిక వర్గానికి చెందిన పవిత్ర అనే మహిళ గెలుపొందారు ..

ఇక ప్రతి సంవత్సరం జరిగే బోనాల వేడుకల్లో భాగంగా అ ఊరులోని దేవతలకు మొదటి బోనం ఇవ్వడం ఆనవాయుతిగా వస్తున్న సంప్రదాయం..ఈ నేపధ్యంలో అ ఊరి గ్రామ సర్పంచ్ గా కత్తుల పవిత్ర తన భర్త కుమార్‌తో కలిసి ఆలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లారు . ఈ క్రమంలో అదే గ్రామానికి చెందినా ఎనమిది మంది అగ్రవర్ణ కులస్థులు వారిని అడ్డుకొని కులం పేరుతో దూషించారు . సర్పంచ్ అని చూడకుండా గెంటేసారు . మధ్యలో ఆపడానికి వెళ్ళిన తన భర్తని కొట్టారు. దీనిపైన సర్పంచ్‌ పవిత్ర పోలీసులకు కంప్లేంట్ చేసారు . పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అడుపులోకి తీసుకున్నారు . 

Tags:    

Similar News