జూబ్లీహిల్స్‌లో ఆదివారం పోలీసులు భగ్నం చేసిన రేవ్‌పార్టీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ పార్టీ ఏర్పాటు చేసింది ఓ ఫార్మా కంపెనీగా తేలింది. అలాగే పట్టుబడ్డ యువతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారని తెలిసింది.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అసభ్య నృత్యాలు చేస్తున్న 20 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియాపై యువతులు దాడి చేశారు. ఇష్టానుసారంగా దూషించి ఫోన్స్ పగులగొట్టారు. పబ్ లో రేవ్ పార్టీని ఓ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. డాక్టర్లు, సేల్స్ ఉద్యోగుల కోసం ప్రతి ఏటా ఇలాంటి రేవ్ పార్టీని ప్రసాద్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు.
రేవ్ పార్టీలో పట్టుబడ్డ యువతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాలు, ఈవెంట్ డాన్సుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీలో చిక్కిన యువతులపై 294 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసులు ఇచ్చి వారికి సొంత ఇళ్లలకు పంపించనున్నారు. రేవ్ పార్టీకి అనుమతి ఇచ్చిన పబ్ ను పోలీసులు సీజ్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో రేవ్ పార్టీ విష సంస్కృతి నగర శివార్లలో ఉండేంది. ఇప్పుడు నగరం నడిమధ్యలోకి రావడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది.