హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 'దిశ దారుణ ఉదంతానికి సరిగ్గా ఒకరోజు ముందు (నవంబరు 26) పాతబస్తీలోని ఒక మానసిక వికలాంగురాలిపై ముగ్గురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మతిస్థిమితంలేని యువతిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను వదిలేశారు. బాధితురాలిని మరో ఆటో డ్రైవర్ రేప్ చేశాడు. రాజధానిలో జరిగిన ఈ కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాతబస్తీలోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి మానసికస్థితి సరిగాలేదు. గత నెల నవంబర్ 26 ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చేందుకు పురానాపూల్ చౌరస్తా వద్ద నిలిచి ఉంది. షేరింగ్ ఆటో నడిపే ఖలీమ్, అతడి బంధువు అజీజ్ యువతిని ఇంటి వద్ద దిగబెడతామని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. మూసీ నది ఒడ్డున చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత పురానాపూల్ లో యువతిని వదిలేశారు. బాధితురాలిని మరో ఆటో డ్రైవర్ రేప్ చేశాడు. ఈ ఘోరం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఆటో డ్రైవర్ తీసుకెళుతున్న దృశ్యం సీసీ కెమెరాకు చిక్కింది.