నెల్లూరులో హింసాత్మక పరిస్ధితులు

Update: 2019-04-15 05:38 GMT

ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో చెలరేగిన ఆందోళనలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రాంతాల్లో కూడా తాజాగా దాడుల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం బాహాబాహాకి దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దాడులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సైలెంట్‌గా ఉండే సింహపురి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రశాంతంగా ఉండే రోడ్లు కాస్తా రక్తంతో తడిసిపోయాయి. ఎన్నడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులకు దిగారు.

నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు మీదుగా వస్తున్న టీఎన్ఎస్ఎఫ్ తిరుమల నాయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయలయిన తిరుమల నాయుడిని స్ధానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు దాడి చేశారంటూ ఆందోళనకు దిగారు. కోటం రెడ్డి శ్రీధర్ కార్యాలయాన్ని చుట్టుముట్టి భీబత్సం స్పష్టించారు.

ఎమ్మెల్యే అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారంటూ నెల్లూరు మేయర్ అజీజ్ ఆరోపించారు. ఎన్నికల్లో తాము గెలవబోతున్నామనే భయంతో దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్ధితి ముదురుతూ ఉండటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఓ వైపు దర్యాప్తు నిర్వహిస్తూనే ఇరు పార్టీల కార్యకర్తలకు గట్టి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప్రశాంత జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు .

Full View  

Similar News