దారుణం : సొంతవాళ్లే యువతిని అర్ధనగ్నంగా మార్చి..

Update: 2019-09-04 05:27 GMT

మహిళ గౌరవాన్ని కాపాడాల్సిన కుటుంబసభ్యులే ఆమె పరువును బజారుకీడ్చారు. తనకు నచ్చిన వ్యక్తితో యువతి వెళ్లిపోయిందన్న కోపంతో ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించి కొట్టారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన యువతి.. సమీప గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు పెద్దలు పెళ్ళిచెయ్యాలని భావించారు. అయితే ఇంట్లో వాళ్ళు తెచ్చే సంబంధం ఇష్టం లేక ఆమె ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది.

దాంతో వేరే తెగకు చెందిన వ్యక్తితో ఆమె కలిసి వెళ్లిందనే విషయాన్నీ జీర్ణించుకోలేక ఆమె కుటుంబ సభ్యులు యువతిని వెతికి పట్టుకున్నారు. గ్రామానికి తీసుకువచ్చి అర్ధ నగ్నంగా మార్చి ఇంట్లోని మగ వాళ్లంతా బెత్తంతో ఆమెను కొడుతూ గ్రామంలోని రోడ్ల వెంట తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన అలీరాజ్‌ పూర్‌ ఎస్పీ మాట్లాడుతూ... వాట్సాప్‌ ద్వారా వచ్చిన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News