లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ (73) నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ నేత చిన్మయానంద్ తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఓ న్యాయ విద్యార్థిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసినా చిన్మయానంద్‌ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు చిన్మయానంద్ అరెస్టు చేశారు. యూపీకి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చిన్మయానంద్‌ను విచారించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారి మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ చిన్మయానంద్ అంగీకరించాడని తెలిపారు. ఈ విధంగా చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని , అనేకసార్లు ఆమెను వేధించినట్టుగా ఒప్పకున్నారని అధికారి వెల్లడించారు.
Naveen Arora, Special Investigation Team Chief: Swami Chinmayanand has admitted to almost every allegation levelled against him,including sexual conversations&body massage.Circumstantial evidences also being examined.He said he doesn't want to say more as he's ashamed of his acts https://t.co/d8zfRm0f7K pic.twitter.com/DhdrjN8FOF
— ANI UP (@ANINewsUP) September 20, 2019