హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదీనగూడలో గల ల్యాండ్ మార్క్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహితి ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం మహితి టీసీఎస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తోంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇటు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.