భారీ సెక్స్ కుంభకోణం: మధ్యప్రదేశ్‌లో బాలీవుడ్ బీ గ్రేడ్ హీరోయిన్లతో సెక్స్ రాకెట్! నిందితుల్లో రాజకీయనాయకులు!!
మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ స్కాంతో సంబంధం ఉన్న బాలీవుడ్ బీ- గ్రేడ్ హీరోయిన్లతోపాటు రాజకీయ నేతలు, కాలేజ్అమ్మాయిలు, అధికారులను ట్రాప్‌చేసి, ఆపై బెదింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ స్కాంతో సంబంధం ఉన్న బాలీవుడ్ బీ- గ్రేడ్ హీరోయిన్లతోపాటు రాజకీయ నేతలు, కాలేజ్అమ్మాయిలు, అధికారులను ట్రాప్‌చేసి, ఆపై బెదింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... నిందితులు సీక్రెట్ వీడియోలు తీసి అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలపై భోపాల్‌కు చెందిన శ్వేతా జైన్(48), ఆర్తీ (34), శ్వేతా సునీల్జైన్(39), బర్ఖా సోనీ(35) అనే నలుగురు మహిళలతో పాటు కారు డ్రైవర్ ఓం ప్రకాశ్(34), ఓ కాలేజ్ విద్యార్థినిను సిట్బృందం బుధవారం అరెస్టు చేసింది. నిందితుల నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిలో 4వేలకు పైగా వీడియోలు, ఆడియోలు, చాటింగ్ స్క్రీన్షాట్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. లిస్టులో మాజీ గవర్నర్, సీఎంల పేర్లు కూడా ఉన్నట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్ ఏడీజీపీ సంజీవ్ షామి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందంతో ఈ హనీట్రాప్ బ్లాక్ మెయిలింగ్ ముఠాను బట్టబయలు చేసింది. శ్వేతా స్వప్నిల్ జైన్ సూత్రధారిగా ఈ ముఠా భోపాల్, ఇండోర్ కేంద్రంగా పనిచేస్తోందని, ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ముఖ్యశాఖల సంబంధించిన అధికారులే వీరి టార్గెట్‌గా శ్వేతా జైన్ హనీట్రాప్ చేయిస్తున్నారని బయటపడింది. వీడియోల ఆధారంగా వాటిని ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సంజీవ్ వెల్లడించారు.
ఏడీజీపీ సంజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... వీరు ముందుగా టార్గెట్ చేసుకున్న వ్యక్తుల్ని పరిచయం చేసుంటారని, ఆ తర్వాత హోటల్ లేదా అతిథి గృహానికి అమ్మాయిలను పంపిస్తారిని పోలీసుల తెలిపారు. ఆ తర్వాత లోపల జరుగుతున్న తతంగాన్ని స్పై కెమెరాలు లేదా మొబైల్స్ కెమెరాలతో సీక్రెట్‌గా వీడియోలను చిత్రీకరిస్తారు. రాజకీయ నాయకులు అధికారులు కోరుకుంటే బాలీవుడ్ హీరోయిన్లతో కూడా ఏర్పాటు చేయిస్తారని పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఓ బిల్డింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారని విచారణలో శ్వేతా జైన్ వెల్లడించినట్లు ఏడీజీపీ సంజీవ్ కుమార్ తెలిపారు.
అయితే ఈ రాకెట్లో బీజేపీ నేతల పేర్లే కమల్ నాథ్ సర్కార్ టార్గెట్ చేసుకొని బయట పెడుతోందని కొందరూ బీజేపీ నాయకులు ఆరోపించారు. దీని స్పంధిచిన కాంగ్రెస్ పార్టీ నేత విశ్రా పోలీసులు ఈ సెక్స్ స్కాండల్ వ్యవహారంలో కాంగ్రెస్ వారిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు.