ఏకే-47 కాల్పుల ఘటనపై రిటైర్డ్ సీఐ భూమయ్య స్పందించారు. ఆనాడు హుస్నాబాద్ నుంచి తాను బదిలీ అయిన రెండు నెలల తర్వాత తుపాకులు మాయమయ్యాయని, అయితే, ఆ తప్పును తనపైనా, గన్‌మెన్‌పైనా నెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క తూటా లెక్కతేలకపోతేనే కఠిన చర్యలు తీసుకునే పోలీస్ డిపార్ట్‌మెంట్ రెండు తుపాకులు పోయినా, ఎవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని భూమయ్య ప్రశ్నించారు.
అప్పటి ఎస్సై నిర్లక్ష్యం వల్లే తుపాకులు పోయాయని, తాజా కాల్పుల ఘటన జరగకపోయి ఉంటే ఇప్పటికీ తుపాకులు తన దగ్గరే ఉన్నాయని నిందించేవారని, తనపై అధికారులు కక్ష సాధించారని ఆరోపించారు. పొరపాటున ఏకే47 ఆటో మోడ్‌లో ఉండి ఉంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేమని సీఐ భూమయ్య అన్నారు.