అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్ లైన్ మోసాలు మీతిమిరిపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుండి మొదలు పెడితే సినీ సెలబ్రిటీల వరకు ఈ సైబర్ నేరగాళ్ల చేతిల్లో బలికాక తప్పుడం లేదు. అయితే సైబర్ నేరాగాళ్లు రూట్ మార్చి రాజకీయ నాయకులవైపు కన్నేసారు. తాజాగా ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో పడిండి ఎవరో కాదు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, ఎంపీ ప్రణీత్ కౌర్ ఈ జాబితాలో చేరారు. ప్రణీత్ కౌర్ బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా రూ. 23 లక్షలు మాయం చేశారు. ప్రణీత్ కౌర్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ప్రణీత్ కౌర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఇక వివరాల్లోకి వెళితే పార్లమెంటు సమావేశాలకు అని బయలుదేరుతున్న సమయంలో ఎంపీ ప్రణీత్ కౌర్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ లిప్ట్ చేయగానే మేడమ్ నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ని మాట్లాడుతున్నా.. మేడమ్ మీ సాలరీ డిపాజిట్ కోసం బ్యాంకు ఖాతా వివరాలు చెప్పమన్నాడు. ఈ మేరకు మీ అకౌంట్ నంబరు, ఏటీఎం పిన్ నంబరు, సీవీసీ నంబరుతో పాటు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే నిజంమేనని నమ్మిన ఎంపీ వెంటనే అన్ని వివరాలు చెప్పేసింది. ఖతం ఇంకేముంది కొద్ది నిమిషాల్లోనే తన అకౌంట్ నుండి రూ. 23 లక్షలు ఎగిరిపోయినట్లు తనకు మొసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన ప్రణీత్ కౌర్ వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నేరగాడి ఫోన్ నంబర్ ఆధారంగా గుర్తించారు. నిందితుడు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా అతడి పేరు అతౌల్ అన్సారీ అని గుర్తించారు.