పబ్జీ ఈ మొబైల్ గేమ్ ఇపుడు పెను సమస్యగా మారిపోయింది. గేమ్ ఆడుతూ మతి భ్రమిస్తున్న వాళ్ళున్నారు. గేమ్ లోకంగా మారిపోయి రోడ్లమీద తిరుగుతున్న వాళ్ళూ ఉన్నారు. మొన్నా మధ్య ఒకమహిళ తన భర్త పబ్జీ గేమ్ ఆడొద్దంటున్నాడని విడాకులు కావాలని కోర్టు కెక్కిన సంఘటన విన్నాం. ఇపుడు ఒక వనిత గేమ్ ఆడుతున్నప్పుడు తనకు గేమ్ లో పరిచయమైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను.. నాకు విడాకులు కావాలంటూ కోరుతోంది.
గుజరాత్ కి చెందిన ఓ 19 ఎల్లా వివాహితురాలు పబ్జీ గేమ్ ఆడటంలోనే పొద్దంతా గడిపేది. పబ్జీ గేమ్ ఆడేటప్పుడు ఆన్ లైన్ లో చాలా మంది కలుస్తుంటారు. వారితో కల్సి శత్రువులను అంతమొందించడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఆడే క్రమంలో ఆ యువతి ఓ యువకుడితో ప్రేమలో పడిపోయింది. దీంతో ఆమె ఆ యువకుడిని పెళ్లిచేసుకుంటానని మంకు పట్టు పట్టింది. అతడితోనే కలిసి ఉంటాననీ, తనకు విడాకులు ఇప్పటించాలని ఉమెన్స్ హెల్ప్‌లైన్ 'అభయం -181'కు ఫోన్ చేసి కోరింది. దీంతో అధికారులు ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆమె ను అత్తింటి వారిఁబ్బండుపు పెడుతున్నారేమో అనే కోణంలో విచారించారు. విచారణలో గేమ్ కారణంగానే ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తుందని తెలుసుకున్నారు. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు వారు. ఈ సందర్బంగా అభయ్ ప్రాజెక్టు చీఫ్ గోహిల్ మాట్లాడుతూ.. తమకు రోజుకు ఈ తరహా కాల్స్ 550 వరకూ వస్తుంటాయనీ, అయితే పబ్ జీ కారణంగా విడాకులు కోరిన కేసు మాత్రం ఇదే మొదటిదని తెలిపారు. పబ్ జీ అలవాటును తప్పించేందుకు ఆమెను అహ్మదాబాద్ లోని పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పగా, అక్కడ ఫోన్లను అనుమతించరని తెలుసుకున్న యువతి, వెళ్లేందుకు నిరాకరించిందని చెప్పారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సదరు యువతి చెప్పిందని పేర్కొన్నారు.