చిన్నారి వర్షిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఆరేళ్ల చిన్నారి వర్షిత తల్లిదండ్రులతో కలిసి కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది.

Update: 2019-11-16 11:52 GMT
varshitha case

చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని వీడింది.. దీనికి కారకుడైన లారీ డ్రైవర్ రఫీ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆరేళ్ల వర్షితపై లైంగిక దాడి చేసి రఫీ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. సీఎం జగన్‌ ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఇదివరకే గ్రామంలో చిన్నారి వర్షిత పట్ల లారీ డ్రైవర్ రఫీ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఆరేళ్ల చిన్నారి వర్షిత తల్లిదండ్రులతో కలిసి కురబలకోట మండలం చేనేతనగర్‌లో ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. అప్పటివరకు పెళ్లి ఇంట్లో సందడి చేసిన చిన్నారి సడెన్‌గా కనిపించకుండా పోయింది. ఈ నెల 6వ చిన్నారి మృతదేహం పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో లభించింది. పోస్టుమార్టంలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది.దీంతో కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో విచారణ జరిపి చివరికి హంతకుడిని పట్టుకున్నారు.

మొదటి నుంచి చిన్నారి హత్య కేసులో లారీ డ్రైవర్‌ రఫీపైనే అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా చేశారు. గతంలో రఫీ ప్రవర్తన సరిగా లేదని భార్య వదిలివెళ్లిపోయింది. ఇటు చిన్నారి హత్య తర్వాత రఫీ కూడా ఊరిలో కనిపించకపోవడంతో అనుమానాలు పెరిగాయి. పైగా మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ ఉండడంతో అతడిపై అనుమానం వచ్చిన పోలీసులు 6 బృందాలతో ఏర్పడి చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో రఫీని అదుపులోకి తీసుకున్నారు.  

Tags:    

Similar News