పోలీసుల అదుపులో ప్రేమోన్మాది సుధాకర్‌రెడ్డి

Update: 2019-10-19 11:46 GMT

రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా కవిటం గ్రామంలో ఎమ్మెస్సీ విద్యార్థిని తేజస్వినిపై దాడి చేసిన ప్రేమోన్మాది సుధాకర్‌రెడ్డిని పాలకొల్లు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ ఇక పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు సుధాకర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు డీఎస్పీ నాగేశ్వర్‌రావు.

సుధాకర్‌రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శించారు. తేజస్వినికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తేజస్విని కుటుంబానికి అండగా ఉంటామన్న ఆయన భవిష్యత్‌లో ఆమెకు భద్రత కల్పిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారని ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News