దారుణం.. కన్నకూతురిపై తల్లిదండ్రుల హత్యాయత్నం !

Update: 2020-02-07 06:17 GMT

నల్గొండ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మునుగోడు మండలం వెలగలగూడెంలో కన్నకూతురిని హత్య చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. వివాహం చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తోందని యువతిపై బండరాళ్లతో దాడి చేశారు. తల్లిదండ్రులు, సోదరుడు కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే పెళ్లికి ముందే తన తండ్రి ఆస్తిలో తనకు వాటా కావాలని యువతి ఎస్పీ, ఎస్సైకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాత్రి తల్లిదండ్రులు, యువతికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి పేరెంట్స్‌ హత్య చేసేందుకు ప్రయత్నించారు.

Tags:    

Similar News