గోశాలలో 22 ఆవులు మృతి ... 52 ఆవులను రక్షించిన వైద్యులు

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని ఓ గోశాలలో 22 ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 52 ఆవులను వైద్యులు రక్షించారు.

Update: 2019-10-07 10:11 GMT

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని ఓ గోశాలలో 22 ఆవులు మృత్యువాత పడ్డాయి. మరో 52 ఆవులను వైద్యులు రక్షించారు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆవులు మరణించడంతో గోశాల సంరక్షకుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. కాగా.., జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో 22 ఆవులు మృతి చెందిన విషయం తెలిసి అక్కడి చేరుకున్నామని 52 ఆవులను రక్షించామని తెలిపారు. సజ్జ ఆకుల్లో విషవాయువులు ఎక్కువగా ఉందని, నైట్రేట్ విషంతోనే గోవులు మరణించినట్టు పేర్కొన్నారు. 

Tags:    

Similar News