హైదరాబాద్‌లో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Update: 2019-06-25 03:40 GMT

హైదరాబాద్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా.. యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ఇద్దరు తాగినట్టు గుర్తించారు. తల్లిదండ్రుల మధ్య గొడవలే వీరి ఆత్మహత్యయత్నానికి కారణంగా చెబుతున్నారు. నల్గొండ జిల్లా రంగారెడ్డి గూడకు చెందిన సందీప్ రెడ్డి, త్రివేణి వరుసకు బంధువులు. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే వారి తల్లిదండ్రుల మధ్య గొడవతో వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యయత్నం చేశారు. తాము మరణించాక సమాధులు పక్కపక్కనే కట్టాలని సూసైడ్ నోట్‌లో రాశారు. సందీప్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. త్రివేణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో యశోధ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  



 


Tags:    

Similar News