శృంగారంలో పాల్గొనలేదని.. భర్తను చితకబాదిన భార్య

Update: 2019-05-30 07:57 GMT

తన భర్త శృంగారంలో పాల్గొనలేదనే కోపంతో తన భర్తను చితకబాదిందో భార్య. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ సంఘటన అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగింది. తన భర్తపై దాడిచేయడమే కాకుండా ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి తన భర్తే తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫోన్ మేరకు హుటాహుటినా వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే అక్కడి వెళ్లిన పోలీసులు ఆమెని గమనించారు. తన ఒంటిపై ఒక్కదెబ్బకూడా లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో పిల్లలను ఏం జరిగిందని అడిగారు దానికి పిల్లలు సమాధానం ఇస్తూ మా డాడీ ఎలాంటి దాడి చేయలేదని మా మమ్మే డాడీపై దాడీ చేసిందని చెప్పారు.

దాంతో భర్తను ఏం జరిగిందని ప్రశ్నించగా అతను చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. తన భార్య పుల్లుగా మందుతాగి మత్తులో ఉందని, ఆ మత్తులో తన వద్దకు వచ్చి శృంగారంలో పాల్గొనాలని అతి బలవంతం చేసినట్టు చెప్పాడు. తన పిల్లల ముందు తన భర్య ప్రవర్తన చూసిన భర్త ఆమె అడిగిన దానిని తిరస్కరించని చెప్పాడు. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఎరికా భర్తను చేతికి అందిన వస్తువు తీసుకుని చితక్కొట్టింది. సదరు మహిళ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుని ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  


 


Similar News