నెల్లూరులో అమాయక యూవతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని అమాయక యువతులను జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి నమ్మిస్తున్నాడు. తర్వాత వారిని శారీరకంగా లోబర్చుకుని, వీడియో తీసి బెదిరిస్తున్నాడు.
నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఓ చోట వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. వ్యభిచారం గృహం నడుపుతున్న 8 మంది నిర్వాహకులను 5 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుండి పలు వాహనాలు, సెల్ ఫోన్లు, ఒక కంప్యూటర్ తో పాటు పన్నెండు వేలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్ అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.