అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన నిందితుడు మృతి

Update: 2020-02-11 05:59 GMT

8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన నిందితుడు మహమ్మద్ పహిల్వాన్ మృతి చెందాడు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ పహిల్వాన్ గుండెపోటుతో చనిపోయాడు. అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్టయిన ఇతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో గాయపడ్డాడు. ఈ ఘటనలో అక్బర్ శరీరలోకి 2 బుల్లెట్లు, 17 కత్తి పోట్లు దిగాయి. ఆ సమయంలో అక్బరుద్దిన్‌ శరీరంలో నుంచి డాక్టర్లు కేవలం ఒకే బుల్లెట్‌ తీశారు. దీంతో ఆయన శరీరంలో ఉన్న మరో బుల్లెట్‌ కారణంగా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అక్బరుద్దీన్ ఆరోగ్యం అనేక సార్లు క్షీణించింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం అప్పుడప్పుడు లండన్‌ కూడా వెళ్తుంటారు.

Tags:    

Similar News