ఇతనో వెరైటీ దొంగ .. రాత్రి పడుకొని పొద్దున దొంగతనం చేస్తాడు ..

Update: 2019-08-04 11:21 GMT

సహజంగా దొంగతనం ఎప్పుడు చేయాలి అన్నది దొంగతనం అలవాటు లేని వాడు కూడా టక్కున చెప్పే సమాధానం రాత్రిపూట. కానీ ఇక్కడ ఓ దొంగ మాత్రం వెరైటీ .. ఫుల్ గా నైట్ పడుకొని ఉదయం దొంగతనం చేస్తాడు . చేసిన దొంగతనాలకు ఎప్పుడో ఒకసారి బయటపడక తప్పదు కదా ..! అలా దొంగతనాలు చేస్తూ మీయపూర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు .. అయితే దొంగ పద్ధతి చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు ..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన చేగుంట భీమ్‌రావు(29 ) హైదరాబాదులోని పలు ప్రైవేట్ సంస్థలకు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. కష్టపడి పని చేయడం కన్నా ఈజీగా మనీ సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. రోజు దొంగతనాలకు ఎలా చేయాలో స్కెచ్ వేశాడు. రాత్రిపూట దొంగతనాలు చేస్తే ఏం వెరైటీ అనుకున్నాడో ఏమో కానీ ఉదయాన్నే దొంగతనాలు మొదలు పెట్టాడు . అందరు ఆఫీస్ కి వెళ్ళాక పక్కింట్లో ముచ్చట్లు పెట్టె మహిళల ఇల్లు అతనికి బాగా కలిసి వచ్చాయి .

ఇలాంటి ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని వరుసగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 21వ తేదీన మార్తాండ నగర్ ఏరియాలో ఓ దొంగతనం జరిగింది . ఇంటి సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపులు మొదలు పెట్టారు . ఈ క్రమంలోనే అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన భీమ్‌రావుని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు నిజాలు బయటపెట్టాడు . అతడి నుండి 20 తులాల బంగారు నగలు.. 10 తులాల వెండి ఆభరణాలు 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకున్న మియాపూర్ పోలీసులను డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించి రివార్డులు అందించారు. 

Tags:    

Similar News