హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. కొత్తపేట హుడా కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వివాహిత శ్రీలేఖ భవనం ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.