తన కోరిక తీర్చలేదన్నకసితో పోర్న్ సైట్‌లో యువతి..
ఓ యువతి తనతో శృంగారానికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ యువకుడు ఏకంగా ఆ యువతి ఫోన్ నెంబర్‌ను పోర్న్ సైట్స్‌లో అప్‌లోడ్ చేశాడు. నంబర్ సెట్ లో పెట్టిన దగ్గరి నుండి తనకు ఎవరెవరో తనకు ఫోన్లు రావడం, అసభ్య మొసెజు వస్తుండంతో ఆ యువతి భరించలేక పోలీసులను ఆశ్రయించింది.
ఓ యువతి తనతో శృంగారానికి ఒప్పుకోలేదనే కోపంతో ఓ యువకుడు ఏకంగా ఆ యువతి ఫోన్ నెంబర్‌ను పోర్న్ సైట్స్‌లో అప్‌లోడ్ చేశాడు. నంబర్ సెట్ లో పెట్టిన దగ్గరి నుండి తనకు ఎవరెవరో తనకు ఫోన్లు రావడం, అసభ్య మొసెజు వస్తుండంతో ఆ యువతి భరించలేక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఒర వివరాల్లోకి వెళితే.. ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యువతికి, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మొహమ్మద్ ముదాసిర్‌తో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయంతో యువతిని ఎలాగైన లొంగదీసుకుందాం అని పథకం పన్నాడు. అప్పడి నుండి ఆ యువతిపై అసభ్య ప్రవర్తన నచ్చకపోవడంతో మొహమ్మద్ ముదాసిర్‌ను దూరం పెట్టింది. అయితే తన కోరిక తీర్చలేదన్న కసితో ఆ యువతి ఫోన్ నెంబర్‌ను ఓ పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇందులో భాగంగా ఓ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, ఓ మార్ఫింగ్ ఫొటోను పెట్టి.. ఆమె నెంబర్ పోస్ట్ చేశాడు. ఇక అప్పటి నుండి సదరు యువతికి ఫోన్లు రావడం, అసభ్య మెసేజ్‌లు రావడం. రోజూ అసభ్యపదజాలంతో మాట్లాడడంతో అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు మొహమ్మద్ ముదాసిర్‌ను అరెస్ట్ చేశారు.