మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం..61 మంది మహిళలను..

Update: 2019-07-02 10:13 GMT

మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వ్యాపించడంతో బాధిత యువతి ఒకరు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో సెల్‌ఫోన్లను మరమ్మతులు చేసుకుంటూ ఉపాధి పొందే అనిశెట్టి సాయి అనే యువకుడు మాయమాటలతో పలువురు యువతులు, మహిళలను వంచించాడు. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియో తీశాడు. ఫోన్ల మరమ్మతు పనులు నేర్చుకునేందుకు ఈ దుకాణంలో చేరిన మరో యువకుడు ఈ వీడియోలను గమనించి రహస్య వీడియోలను చోరీ చేసి గ్రామంలో మరికొంత మందికి పంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆ వీడియోలన్నీ సేకరించి వాటి ఆధారంగా బాధ్యుడిని సొమ్ము కోసం డిమాండు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బేరం కుదరకపోవడంతో కొన్ని అశ్లీల వీడియోలను పలు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉంచాడు. దీంతో బాధితుల్లో ఓ యువతి మొగల్తూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫోన్లను సీజ్‌ చేశారు పోలీసులు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను నిందితుడు వంచించాడని, ఆ కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

Full View   

Tags:    

Similar News