పగలు మనిషి... రాత్రికి రక్తం తాగే డ్రాకులా !

పచ్చి నెత్తురు తాగే నరరూప రాక్షసులను దయ్యాలకోట, డ్రాకులా, వంటి హాలివుడ్ చిత్రాల్లోనే చూస్తుంటాం.. కానీ ఇప్పుడు ఇలాంటి రక్షుసుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం సంచలనంగా మారింది. తెలంగాణలో ఓ వ్యక్తి వింత ప్రవర్తనతో అందరిని భయభ్రంతులకు గురిచేస్తున్నాడు.

Update: 2019-10-04 09:17 GMT

పచ్చి నెత్తురు తాగే నరరూప రాక్షసులను దయ్యాలకోట, డ్రాకులా, వంటి హాలీవుడ్ చిత్రాల్లోనే చూస్తుంటాం.. కానీ ఇప్పుడు ఇలాంటి రక్షుసుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం సంచలనంగా మారింది. తెలంగాణలో ఓ వ్యక్తి వింత ప్రవర్తనతో అందరిని భయభ్రంతులకు గురిచేస్తున్నాడు. పగలు గ్రామస్థులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి రాత్రయితే రక్తపిశాచిలా మారుతున్నాడు. వనపర్తి జిల్లాలోని సింగం పేట ఈ సంఘటన వెలుగు చూసింది.

కమ్మరి రాజు అనే వ్యక్తి గ్రామంలోని మూగజీవాలను ఎత్తుకెళ్లి చంపి పచ్చి నెత్తురు తాగుతున్నాడు. కమ్మరి రాజు పగటిపూట అందరిలా మామూలుగా తిరుగుతుంటాడు. ఇక రాత్రి అతనిలోని రక్తపిశాచి బయటకు లేస్తుంది. గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లి వాటి రక్తం తాగేస్తున్నాడు.

కమ్మరి రాజు పదోతరగతి వరకు చదివి కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. అందరితో కలిసిమెలిసి ఉండే రాజుకు రక్తం తాగే అలవాటు ఎలా వచ్చిందో కుటుంబ సభ్యులకు కూడా తెలియదని తెలుస్తోంది. రాజు వింత ప్రవర్తనతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. మొదట గాలి సోకిందని భావించారు. కొన్ని సార్లు గ్రామస్థులు రాజును హెచ్చరించారు. అయిప్పటికీ రాజు మారలేదు. పంచాయితీ పెట్టించి రాజుకు జరిమానా విధించారు. రాజులు మారకపోవడంతో, చిన్నపిల్లలను ఏమైనా చేసే అవకాశం ఉందని గ్రామ వాసులు తీర్మానించుకుని రాజుని మానసిక వైద్యశాలకు పంపించాలి నిర్ణయించుకున్నారు.

అందరితో బాగా ఉండే రాజు మేకలను ,గొఱ్రలను, చంపి రక్తం తగడం, మళ్లీ తెల్లవారు జామునే వాటిని యజమాని ఇంటి దగ్గర పడేసివేళ్తాడు. ‎ ఇప్పటిదాక కమ్మరిరాజు 50వేలపైచిలుకు గొర్రెలను చంపి రక్తం తాగినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. రక్తం రుచి మరిగిన రాజు బయట ఉంటే ప్రమాదమని ఆ ఊరి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ తీర్మానించి మానసిక ఆస్పత్రికి పంపించాలని నిర్ణయించారు. ఇందుకు రాజు కుటుంబ సభ్యులు కూడా సమ్మతించినట్లు గ్రామస్తులు తెలిపారు. 

Tags:    

Similar News