న్యూస్టైల్‌లో దొంగతనం... పట్టపగలే బ్యాంకు లూటీ ఎలా చేశారంటే..

గోబర్సాహి ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంకులోని మెుఖాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించి ఆరుగురు వ్యక్తులు లూటీకి పాల్పడ్డారు. మొదట బ్యాంకులోకి ప్రావేశించిన దుండగులు తుపాకులతో బెదిరించి బ్యాంకులోని రూ.8,05,115 నగదులోపాటు సెక్కూరిటీ గార్దు రైఫిల్ కూడా అపహరించుకుపోయారు.

Update: 2019-10-06 09:46 GMT

బ్యాంక్ దొంగతాన్లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు బిహార్ చెందిన దొంగల ముఠా. ద్విచక్ర వాహనదారులు రక్షణగా తలకు హెల్మెట్లు ధరించాలని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం నడుస్తూ హెల్మెట్లు ధరించారు. వారి చూడగానే ప్రజలకు సందేశం ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమం తలపెట్టిందని అంతా అనుకున్నారు. కానీ వారు ఒక్క సారిగా బ్యాంకులోకి చొచ్చుకొని వెళ్లి తుపాకులతో ఖాతాదారులను, అధికారులను బెదించారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‎పూర్‎లోని గోబర్సాహి ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంకులో జరిగింది.

గోబర్సాహి ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంకులోని మెుఖాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించి ఆరుగురు వ్యక్తులు లూటీకి పాల్పడ్డారు. మొదట బ్యాంకులోకి ప్రావేశించిన దుండగులు తుపాకులతో బెదిరించి బ్యాంకులోని రూ.8,05,115 నగదులోపాటు సెక్కూరిటీ గార్దు రైఫిల్ కూడా అపహరించుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫూటెజ్‎ని పరిశీలించారు. బ్యాంకు అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణచేస్తున్నామని, త్వరలోనే ఈ దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.




  


Tags:    

Similar News