స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినులకు లైంగిక వేధింపులు..

Update: 2019-07-08 05:40 GMT

సరస్వతి నిలయంలో ‌కీచక పర్వం బయటపడింది. కన్నతండ్రిలా మార్గదర్శకంగా ఉండాల్సిన అధ్యాపకుడే కామాందుడుగా మారాడు. విద్యార్థులకు స్పెషల్ క్లాస్ పేరుతో లోభర్చుకోవడానికి ప్రయత్నించాడు ఓ లెక్చరర్. అధ్యాపకుడి వేధింపులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమైన విద్యార్థినులు చివరకు తమ తలిదండ్రులతో చెప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతగాడి గుట్టురట్టైంది. ఇక వివరాల్లోకి వెళితే హన్మకొండలోని ఓ ప్రయివేటు జూనియర్ కాలేజీలో రంజిత్ కుమార్ అనే వ్యక్తి లెక్చరర్‌గా బోధిస్తున్నాడు.

అయితే చదువులో కొద్దిగా వెనకబడిన విద్యార్థినులకు ప్రత్యేక శ్రద్ద పెడుతున్నానని అందుకోసం ప్రత్యేక తరగతులు తీసుకుంటానని ఇటివల విద్యార్థినులకు చెప్పాడు. స్పెషల్ క్లాసెస్ కి వచ్చేవారు తనకి ఫోన్ చేసి రావాలని వెల్లడించాడు ఆ అధ్యాపకుడు. దీంతో విద్యార్థులు అతనికి ఫోన్ చేసి మేము స్పెషల్ క్లాసెస్‌కి వస్తున్నాం అని పలువురు విద్యార్థినులు ఫోన్‌లో తెలపడం జరిగింది. ఇక ఇదే అదునుగా చేసుకొని విద్యార్థినిల నంబర్స్ సేవ్ చేసుకొని అప్పటి నుండి లైంగిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. అసభ్యకర మెసెజ్ లు పంపుతూ ఉండేవాడు. దీంతో విద్యార్థినులు ఈ వేధింపులు తట్టుకొలేక తమ తలిదండ్రులకు అసలు విషయాన్ని వెల్లగక్కారు. దీంతో వారు వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాలకు వెళ్లి విద్యార్థినుల నుండి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

Tags:    

Similar News