మ్యాజిక్ తీవ్ర విషాదాన్ని నింపింది. విన్యాసం వికటించింది అంతా చూస్తుండగానే ఓ జాదూగర్ గంగా నది నీటిలో మునిగిపోయాడు. అతడి కోసం గజ ఈతగాళ్లు నదిని జల్లెడ పట్టగా 24 గంటల తర్వాత శవమై తేలాడు.
ఓ జాదూగర్ చేసిన సాహసం అతని ప్రాణాలు పోయేలా చేసింది అంతా చూస్తుండగానే ఆ జాదూగర్ గంగా నది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. జాదూగర్ మంద్‌రాకేగా ప్రసిద్ధి పొందిన చంచల్ లాహిరి లైవ్ స్టంట్ చేయడానికి సిద్ధమయ్యాడు పోలీసులు, మీడియా, కుటుంబ సభ్యులు, వందలాదిమంది చూస్తుండగా కాళ్లు, చేతులను తాళ్లతో బంధించిన లాహిరిని ఓ గ్లాస్ బాక్స్‌లో పెట్టి తాళం వేశారు. తర్వాత ఆ బాక్స్ ని నదిలో విడిచిపెట్టారు.
లాహిరి ఆ సంకెళ్లు తెంచుకుని బాక్స్ నుంచి బయటకి రావాలి. ఇదీ విన్యాసం. ఈ స్టంట్ పేరు అండర్ వాటర్ స్టంట్. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అలా దిగిన లాహిరి ఎంతకూ బయటకు రాలేదు. దీంతో బయట ఉన్న వారంతా కంగారు పడ్డారు. ఏదో ప్రమాదం జరిగిందని గుర్తించారు. లాహిరి నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు ఆయన కోసం గాలించినా లాభం లేకపోయింది. ఆయన జాడ కానరాలేదు.
గతంలో సంకెళ్లతో బంధించుకుని నీటిలో దూకి సక్సెస్‌ఫుల్‌గా మ్యాజిక్ చేసిన ప్రముఖ మెజీషియన్ జాదూగర్ మంద్‌రాకే రెండో సారి మాత్రం అదృశ్యమై అనంతరం మృతి చెందారు. స్టంట్ చేసిన 24 గంటల తరువాత ఆయన మృతదేహాన్ని గుర్తించి పోలీసులు బయటకు వెలికి తీసారు 40 ఏళ్ల మంద్‌రాకే మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.