విశాఖ వాసులను కిలాడీ గ్యాంగ్ టార్గెట్ చేసింది. కిలాడి గ్యాంగ్ విసిరిన హాని ట్రాప్ ఉచ్చులో పలువురు చిక్కుకున్నారు. ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేసింది. వారి మాటలకు పడిపోయి లక్షలు సమర్పించుకుని లబోదిబోమంటున్నారు. కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు ఎంతో మంది బలవుతున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టి, పలు ఆకర్షణీయమైన ఆఫర్లతో జనాలను ఈ గ్యాంగ్ ట్రాప్ చేస్తుంది. తీయని మాట్లతో కస్టమర్లను ఆకట్టుకుని జేబులు గుల్ల చేస్తున్నారు. ఓస్లాం ఐటీ ముసుగులో ఈ దందా కొనసాగుతుంది
విశాఖలో ఒకరి నుంచి 18 లక్షలు, మరొకరి నుంచి 3 లక్షలు కాజేసింది ఈ గ్యాంగ్. ఇంకా బయటపడని బాధితులు చాలా మందే ఉంటారని అనుమానం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే కోల్ కతాలో డొంక కదిలింది. దీంతో కోల్ కతాకు వెళ్లిన విశాఖ పోలీసులు అక్కడున్న 24 మంది టెలికాలర్లతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వీరిని కోల్ కతా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పీటీ వారెంట్ కు కోర్టు అనుమతిస్తే వారందరినీ విశాఖకు తీసుకొచ్చి లోతుగా దర్యాప్తు చేయనున్నారు.