అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన యువతిపై..ఉన్మాది అత్యాచారం చేసి అంతమొందించాడు. మృతురాలిని 19 ఏళ్ల రూత్ జార్జ్‌గా గుర్తించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హైయ్యర్ స్టడీస్ చదువుతోంది. నవంబర్ 23వ తేదీన ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. రూత్ జార్జ్ మృతదేహాన్ని యూనివర్సిటీలో ఉన్న గ్యారేజీలో గుర్తించారు. తన కారులోనే రూత్ జార్జ్ శవమై కనిపించింది. ఈ హత్య కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసును నమోదు చేశారు.
నవంబర్ 22వ తేదీ నుంచి రూత్ జార్జ్ ఆచూకీ లేకుండాపోయింది. దీంతో ఆ యువతి పేరెంట్స్ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఉన్న ఫోన్.. హాల్‌స్టెడ్ స్ట్రీట్ పార్కింగ్ గ్యారేజీ వద్ద పింగ్ అయినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన పోలీసులు స్వంత కారులోని బ్యాక్‌సీటులో రూత్ శవమై ఉన్నట్లు గుర్తించారు. రూత్ జార్జ్ ఒంటరిగానే గ్యారేజ్‌లోకి వెళ్లింది. కానీ కొద్ది క్షణాల తర్వాత నిందితుడు తుర్‌మాన్ కూడా ఆ గ్యారేజీలోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా పోలీసులు తేల్చారు. జార్జ్ మృతదేహానికి ఆటాస్పీ చేసిన వైద్యులు ఆమె హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం జార్జ్‌ది హైదరాబాద్‌గా తెలుస్తోంది.