సిటీలో మరో హనీట్రాప్ .. సెల్ఫోన్లో రికార్డైన వ్యాపారవేత్తతో నెరపిన రాసలీలలు
హానీట్రాప్‌కు, హైదరాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ బలయ్యాడు. ఏకంగా 20 లక్షల సమర్పించుకున్నాడు. మరో కోటి రూపాయలివ్వాలంటూ ఒత్తడి తేవడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కిలేడీ ఆగడాలు భయటపడ్డాయి. ఓ ఎయిర్‌హోస్టెస్ వ్యాపారవేత్తను తన వల్లో వేసుకుంది. ఇద్దరూ కలిసి రాసలీలలు జరిపారు. దీనికి ఆమె భర్త కూడా సహకరించాడు. వారిద్దరూ ప్రైవేటుగా గడిపిన దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వ్యాపారవేత్త నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు.
మాట్లాడుకుందామంటూ ఓ రిసార్ట్ కు పిలవడంతో అక్కడికి వెళ్లిన బిజినెస్‌మెన్‌ను గన్ తో బెదిరించారు. దీంతో ప్రాణభయంతో ఆ వ్యాపారవేత్త 20 లక్షలు అప్పజెప్పాడు. అంతేకాకుండా మరో కోటి రూపాయలకు బాండ్ పేపర్ కూడా రాయించుకున్నారు. ఇక లాభం లేదనుకున్న బిజినెస్ మెన్ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కనిష్కలో అరెస్ట్ చేశారు. ఆరా తీస్తే మరో ఎన్ఆర్ఐని టార్గెట్ చేసిన క్రమంలో ఈ కపుల్స్ దొరికారని తేలింది.