పోలిసుల చేజింగ్ : 1800 కిలోమీటర్ల ప్రయాణించి మరీ దొంగలను పట్టుకున్నారు

Update: 2019-09-08 04:16 GMT

ఓ నగల షాప్ లో దొంగతనం చేసి పారిపోయిన దొంగలను ఏకంగా 1800 కిలోమీటర్ల ప్రయాణించి మరి పట్టుకున్నారు హైదరాబాదు పోలీసులు... ఇక వివరాల్లోకి వెళ్తే హైదరబాద్ లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక జ్యుయెలర్స్‌లో బుధవారం రాత్రి మూడు గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది . అప్పటికే సీసీ కెమెరాలతో పాటు అలారం సిస్టమ్‌ ఏర్పాటు చేసుకున్న యజమానికి మొబైల్‌లో అలారం మోగడంతో వెంటనే సీసీ కెమెరాల ద్వారా ఎం జరుగుతుందో చూసాడు . కానీ దొంగలు సీసీ కెమెరాలకి సంభందించిన వైర్లను కట్ చేయడంతో వెంటనే పోలీసులను సంప్రదించాడు ...

అయితే పోలీసులు జ్యుయెలర్ షాప్ కి చేరుకునే లోపే దొంగలు పారిపోయారు. దీనితో దొంగల పై  నిఘా  పెట్టిన పోలీసులు వారు సికింద్రాబాద్-దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు గుర్తించి ఎస్9 బోగీలో ఎక్కినట్లు కన్ఫర్మ్ చేసుకొని వారి వాహనాల్లో రైలును వెంబడించాడు . వారిని పట్టుకునేందుకు బీహార్ పోలిసుల సహాయాన్ని కూడా తీసుకున్నారు . ఎక్కడ కూడా పోలీసులు అనే అనుమానం రాకుండా వ్యవహరిస్తూ మార్గమధ్యంలో దొంగలు ఎక్కిన రైల్లోనే ఎక్కి రైలు చివరి స్టేషన్ దానాపూర్‌ చేరుకోగా ఎస్9 బోగీలో ఉన్న నలుగురు దొంగలను అరెస్ట్ చేశారు. మొత్తం ఈ దొంగతనంలో 12 మంది దొంగలు పాల్గొన్నట్టుగా గుర్తించగా.. మిగతావారికోసం గాలిస్తున్నారు. 

Tags:    

Similar News