రాంగ్‌రూట్‌ డ్రైవింగ్ ప్రాణాల మీదకి.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వీడియో వైరల్

ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్పటికీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొంత మంది వాహనదారులు తమ ఇష్టారీతిన వెళ్తుంటారు.

Update: 2020-02-12 16:22 GMT
ట్రాఫిక్ నిబంధనలు

ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్పటికీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. కొంత మంది వాహనదారులు తమ ఇష్టారీతిన వెళ్తుంటారు. ప్రతిరోజు ఎదో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. వాహనాలు రాంగ్ రూట్ లో నడపడం, వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లాంటి తప్పిదాలు వల్ల నిత్యం అనర్థాలు జరుగుతూన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. రాంగ్ రూట్లో వాహనం నడిపితే డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేస్తామంటూ ఆర్టీఏ ఎన్ని రూల్స్ తెచ్చిన వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. రూల్స్ కి విరుద్థంగా వాహనం నడిపితే ఎలా ఉంటుందో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

నగరంలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ఘటన షాక్ గురిచేస్తుంది. ఓ వాహనదారుడు తన బైక్ రాంగ్ రూట్లో వెళ్లడానికి ప్రయత్నించడంతో.. అతని ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా స్కూటర్‌పై వస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా మరో రూట్‌లోకి మారడం, ఆ వెంటనే అదే రూట్లో వస్తున్న కారు ఢీకొనడంతో పాదచారుడి ప్రాణాల మీదకి తెచ్చింది.

కాగా.. దీని కారణం అయినా వాహనదారుడు మాత్రం తన ప్రమేయం లేనట్లు బాధితుడి వైపు చూస్తుండటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి చెందిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డుయ్యాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. రహదారి నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఒక్కొక్క సారి మనకు తెలియకుండానే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.


  

Tags:    

Similar News