భార్యను చంపేందుకు ఓ భర్త స్కెచ్.. ఒళ్లు జలదరించే ఆ ప్లాన్ ఎలాంటిది?
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. సైనేడ్ ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా చంపేశాడు.
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. సైనేడ్ ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా చంపేశాడు. మదనపల్లిలో జరిగిన ఈ దారుణం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా భార్యను చంపాడు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది.
గత నెల 27వ తేదీన అనుమానాస్పద స్థితిలో జరిగిన మృతి కేసును ఛేదించిన పోలీసులు ఆమని భర్తను, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మీదేవి, జోగినాయుడు కుమార్తె ఆమనిని మదనపల్లెలో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్‌గా పని చేస్తున్న రవిచైతన్యతో వివాహం జరిపించారు. గత నెల 27వ తేదీన ఆమని స్పృహ తప్పి పడిపోయిందని ఆమె భర్త రవిచైతన్య ఆమనిని జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఆమని మృతి చెందింది. తమ కుమార్తెను రవిచైతన్య, వారి తల్లిదండ్రులు హత్య చేశారని ఆమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం ఆమని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా ఆమనికి సైనేడ్ ఇచ్చినట్లు నిర్ధారణ కావటంతో పోలీసులు రవిచైతన్యను, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
మదనపల్లిలో ఆమని హత్య విషయాన్ని ఛేదించిన పోలీసులు రవిచైతన్య అకృత్యాలను వివరించారు. కట్నం తక్కువుగా ఇచ్చారని కొంతకాలంగా ఆమనని వేధింపులకు గురిచేస్తున్నాడని డీఎస్పీ తెలిపారు. రవి చైతన్యకు వివాహేతర సంబంధం ఉందని ఆమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంగా వేధింపులకు గురిచేసి ఆమనిని చంపేశాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆమని మృతి విషయమై హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ డాక్టర్ జానకి స్పందించారు. సైనేడ్ తీసుకోవడం వలన మనిషి వెంటనే చనిపోతారని డాక్టర్ జానకి తెలిపారు. సైనేడ్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఆమనికి బీ కాంప్లెక్స్‌లో కలిపి ఇచ్చి ఉంటాడని సీనియర్ గైనికాలజిస్ట్ జానకి చెబుతున్నారు.