మిస్టరీ కేసు : ఇద్దరితో వివాహేతర బంధం... అడ్డు వస్తున్నాడని భార్త హత్య
ఇద్దరు ప్రియులతో శారీరక సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం జరిగిన మిస్టరీస్ హత్యను పోలీసులు చేధించారు.
ఇద్దరు ప్రియులతో శారీరక సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం జరిగిన మిస్టరీ హత్యను పోలీసులు చేధించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ అంకాపూర్‌కు చెందిన గుజ్జెటి ఉదయ్‌కుమార్ (39) తన భార్య చనిపోవడంతో, ఆలూరు గ్రామనికి చెందిన పావని ఆలియాస్ లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు.
ఉదయ్‌కుమార్, పావని కలసి అంకాపుర్ లో నివాసం ఉంటున్నారు. ఉదయ్ కూలీ పనులు చేస్తుండగా, పావని బడ్డీ కొట్టు నడుపుతూ జీవనం సాగించారు. భర్త ఉదయ్ కుమార్ కు తెలియకుండా పావని తన స్నేహితుడు దౌలాజీ అలియాస్ రమేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంకాపూర్ లోనే పావని భర్త ఉదయ్ స్నేహితుడు గంగాధర్ తో పరిచయం ఏర్ఫడింది. దీంతో భర్తకు తెలియకుండా గంగాధర్ తోనూ వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం పావని భర్త ఉదయ్ దృష్టికి రావడంతో పావనినీ హెచ్చరించాడు.
దీంతో తన శారీరక బంధానికి భర్త అడ్డువస్తున్నాడని అతన్ని అంతం చేయాలని ఇద్దరి ప్రియుల్లతో కలిసి పథక రచన చేసింది. ఈ ఏడాది జూన్ 5న ఉదయ్‌ను పావని ఇద్దరి ప్రియులు కలిసి జరిగిందేదో జరిగింది మరోసారి తప్పు చేయమని నమ్మబలికి ఉదయ్‌ను దావత్ చేసుకుందామని ఒప్పించారు. బైక్‌పై నిర్మల్ సరి హద్దులో పొన్కల్ గ్రామ శివారుకు తీసుకొచ్చారు. దౌలాజీ, గంగాధర్ తక్కువ మద్యం తాగారు.
ఉదయ్‌కుమార్‌కు మద్యం తాగించారు. దీంతో ఉదయ్ ని చంపాలని నిర్ణయించుకోని ఒకసారి పావనికి ఫోన్ చేశారు. ఉదయ్‌కుమార్‌ను చంపాలా.. వద్దా.. అని మరోమారు అడిగి తెలుసుకున్నారు. పావని చంపమని చెప్పింది. దౌలాజీ, గంగాధర్ కలసి ఉదయ్‌కుమార్‌ను గోదావరిలో నీటిలో ముంచి చంపేశారు. ఉదయ్ ను హత్య చేసిన అనంతరం మరోసారి పావనికి ఫోన్ చేశారు. చనిపోయాడో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. మరోసారి ఉదయ్ మృతదేహన్ని పరిశీలించారు. అనంతరం నీటిలో పడేశారు. ఉదయ్ మృతదేహం గోదావరిలో తేలుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నాలుగు నెలలుగా ఉదయ్ కనిపించ పోవడంతో పావని వద్దకు ఉదయ్ కుటుంబ సభ్యలు వెళ్లారు. పావని తన ప్రియుడు దౌలాజీతో కలసి ఉండటంతో కుటుంబ సభ్యలు షాక్ గురైయ్యారు. దీంతో వారిద్దరిని పట్టుకుని నిలదీశారు. అనంతంరం ఉదయ్ కనిపించకుండా పోయాడని మిస్సింగ్ కేసు పెట్టారు. పావనిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును విచారించిన పోలీసులు పావని, ఆమె ప్రియుడు దౌలాజీలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే గంగాధర్ గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్‌కు వెళ్లాడని అతన్ని కూడా త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.