వేరేవారితో అక్రమ సంబంధాలు పెట్టుకోలేదని భార్యకు..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా అక్రమసంబంధాలు పెట్టుకుంటే..ఇంకేదైనా తప్పుచేస్తేనో ట్రిపుల్ తలాక్ చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. తన భార్య ఇప్పటి వరకు ఎవరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే లేదన్న కోపంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా అక్రమసంబంధాలు పెట్టుకుంటే..ఇంకేదైనా తప్పుచేస్తేనో ట్రిపుల్ తలాక్ చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. తన భార్య ఇప్పటి వరకు ఎవరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే లేదన్న కోపంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ విషయం ఏకంగా పోలీసు ఠాణాలో బాధితురాలు పోలీసులతో చెప్పింది. ఇక వివరాల్లోకి వెళితే.. యూపీలోని మీరట్‌కు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమామలు తనను అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తూ తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
అత్తింటివారి కంటే తన భర్త మీద ఆరోపణలు చేసింది. తన భర్త ఎప్పుడూ తనను ఇంకోకరొకరితో లైంగిక సంబంధాలు పెట్టుకోమని ఒత్తిడి చేస్తాడని.. అలా చేయనందుకు తనను నానారకాలుగా హింసిస్తాడని సదరు మహిళ ఆరోపించింది. తాను ఇంకోకరితో లైంగికంగా పాల్గొనందుకు తీవ్రంగా కొట్టాడని ఫిర్యాదులో పెర్కోంది. తన భర్త వేధింపులు తాళలేక తాను పుట్టింటికి వెళ్లిపోయనని.. అయితే అక్కడికి వచ్చిన తన భర్త తనకు తలాక్ చెప్పాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.