11 ఏళ్ల వయస్సులో సామూహిక అత్యాచారం... దేశమంతా తిప్పుతూ 500 మంది మృగాళ్లు నరకం..
ఏకంగా 5వందల మంది బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు తర్వాత ఒకరు ఆ బాలికకు నరకాన్ని చూపించారు.
ఏకంగా 5వందల మంది బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు తర్వాత ఒకరు ఆ బాలికకు నరకాన్ని చూపించారు. ఈ అత్యంత పాశవిక ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇప్పుడు ఆమెకు 40 సంవత్సరాలు ఇన్ని ఏళ్లుగా ఆమె న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తునే ఉంది. వివరాల్లోకి వెళితే.. టెల్ఫోర్డ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక, ఆకతాయి బాలుడి మాటలు నమ్మి ఇల్లు విడిచిపెట్టింది. ఆ బాలుడు ఆమెను తీసుకెళ్లి వృద్ధుడికి పరిచయం చేశాడు. ఆ వ్యక్తి టెల్ఫోర్డ్‌లోని ముఠా వద్దకు బాలికను తీసుకెళ్లాడు. అక్కడ ఆబాలికపై 11 మంది అతీ దారుణం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారు స్నేహితులకు ఆ బాలికను అప్పగించారు. వారు కూడా కామవాంఛ తీర్చుకున్నారు. ఆమె ప్రతిఘటిస్తే దారుణంగా కొట్టారు. ఎంత ప్రాధేయపడిన ఆమెను విడిచిపెట్టలేదు. రోజూ 10 మంది వ్యక్తులు ఆమెపై బలత్కారం చేసేవారు.
కాగా..దీంతో ఆమె వారి చరనుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వెంటనే అతన్ని విడిచిపెట్టారు. బయటకు వచ్చిన వ్యక్తి పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని బాలికను బెదిరించ సాగాడు. దీంతో ఆమె అతడిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంది. అయినప్పటీకి ఆ వృద్ధుడు బాలికను మరో నగరం తీసుకెళ్లాడు. రోజూ కారులో తిప్పుతూ కొత్త వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్ల సాగాడు. అక్కడ కూడా రోజు పలువురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడేళ్లపాటు సుమారు 500 వందలపైగా వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు.
అయితే ఇప్పుడు ఆమెకు 40 సంవత్సరాలు ఇన్ని ఏళ్లుగా ఆమె న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తునే ఉంది. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ వృద్ధుడు లేడు. బ్రిటన్ చరిత్రలో ఎక్కువ అత్యాచారాలకు గురైన ఏకైక బాధితురాలు ఆమె మాత్రమే అని తెలిసింది. ఇప్పుడు ఓబిడ్డకు తల్లి కూడా.. తనకు పట్టిన దుస్థితి ఏ ఆడపిల్లకు పట్టకుడదు అనే కారణంతో పోరాటం చేస్తున్నట్లు తెలిపింది. పోలీసులు తనని 19 సార్లు వ్యభిచారం కేసులో అరెస్టు చేసినట్లు పేర్కొంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ కేసును సిరీయస్ గా తీసుకుంది. మరికొన్ని ఆధారాలను కూడా ఆమె బయటపెట్టింది. ఇక ఆమె చేసిన పోరాటానికి ఫలితం వస్తుందని ఆశిస్తుంది. త్వరలోనే కొందరు నిందితులను పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం ఆమెకు కలిగింది.