ఈఎస్ఐ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఊచలు లెక్కిస్తున్న దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. డొల్ల కంపెనీల వ్యవహారం బట్టబయలు కాగానే అలా వచ్చిన డబ్బులతో తన ఎక్స్ట్రా యాక్టివిటీస్‌తో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. వేదికలపై డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసింది. అదిరిపోయే స్టెప్పులతో హంగామా చేసింది. డ్యాన్సర్‌తో పోటీ పడి మరీ స్టెప్పులేసింది.
అంతేకాకుండా దేవికారాణి నాన్ చాక్ విద్యను కూడా అభ్యసించింది. మరో ఇద్దరితో కలిసి అద్భుతంగా నాన్‌చాక్‌ను ఆడించింది. ఇక బర్త్ డే వేడుకలు అద్భుతంగా నిర్వహించిన వీడియో కూడా బయటకొచ్చింది. అతి కొద్ది మంది సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకుంది.
3 కోట్ల నగలు, బంగారు ఆభరణాలు కొన్న దేవికారాణి పీఎంజే నగల దుకాణానికి డొల్ల కంపెనీ నుంచి వచ్చిన నిధులు బదిలీ చేసేది. పీఎంజేలోనే పెద్ద మొత్తంలో వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బులను దోచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవికారాణి తేజా ఫార్మా ఎండీతో కలిసి 8 షెల్ కంపెనీలు నెలకొల్పింది. ఈ కంపెల ద్వారా 25 కోట్లకు పైగా మందులు కొనుగోలు చేసినట్లు చూపించింది. 5 కోట్ల విలువైన మందులను పాతిక కోట్లకు కొన్నట్లు తెలిసింది. ఇలా వచ్చిన డబ్బులతోనే దేవికారాణి లగ్జరీ లైఫ్‌ను అనుభవించినట్లు పలు వీడియో ఆధారాలు బయటపడ్డాయి.