చనిపోయిన వ్యక్తి.. ఏడుపులు విని లేచాడు.. కానీ..

మృతిచెందాడనుకుంటే నిద్రలోనించి లేచి నట్టుగా లేచి కూర్చుని ఓ వ్యక్త కుటుంబ సభ్యులకు, బంధువులకు షాక్‌ ఇచ్చినంత పనిచేశాడు కాసేపు అందరితో మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకున్నట్టుగానే తిరిగిరాని లోకాలకు వెళ్లి అందరినీ శోక్రసంద్రంలోకి నెట్టాడు.

Update: 2019-01-12 08:27 GMT
nirmal

మృతిచెందాడనుకుంటే నిద్రలోనించి లేచి నట్టుగా లేచి కూర్చుని ఓ వ్యక్త కుటుంబ సభ్యులకు, బంధువులకు షాక్‌ ఇచ్చినంత పనిచేశాడు కాసేపు అందరితో మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకున్నట్టుగానే తిరిగిరాని లోకాలకు వెళ్లి అందరినీ శోక్రసంద్రంలోకి నెట్టాడు. నిర్మల్‌ జిల్లా నరసాపూర్‌ మండలం దర్యాపూర్‌ గ్రామానికి చెందిన లింగన్న(49), కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి కళ్లు, నోరు తెరవకపోవడంతో చనిపోయాడని నిర్ణయించుకుని అతడి అంతిమయాత్రకు ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో ఉన్న కొడుక్కి సమాచారం అందించారు. మృతదేహం చుట్లూ కుటుంబసభ్యులంతా చేరి శోకన్నాలు పెడుతున్న సమయంలో నిద్రలోంచి లేచినట్టుగా లింగన్న లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. సాయంత్రం ఆరింటి వరకూ చక్కగా కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడిన లింగన్న, ఆ తర్వాత మళ్లీ కన్నుమూశాడు. మళ్లీ లేస్తాడేమోనని ఎదురుచూసిన ఆ కుటుంబసభ్యుల ఆశలు ఇక ఆ తర్వాత ఫలించలేదు.

Similar News