శ్రీవారి సుప్రభాత సేవా టిక్కెట్ల అమ్మకం పేరిట మోసం చేస్తున్నఆన్‌లైన్ దళారీ ఆగడాలకు పోలీసుల చెక్ పెట్టారు. తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే వారిలో చాలామందికి స్థానిక స్థితిగతులపై అవగాహన కొరవడడంతో తేలిగ్గా దళారీల వలలో చిక్కుకుంటారు. అలాంటి అమాయకులను మోసగించి పబ్బం గడుపుకుంటున్న ఓ దళారీని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఎంతో సులభంగా దర్శనం కల్పిస్తానని, వసతి ఏర్పాటు చేస్తానని చెబుతూ భక్తులను మోసం చేస్తున్న ఆ దళారీని గుంటూరుకు చెందిన కార్తీక్ గా గుర్తించారు. టూరిజం సంస్థల ద్వారా తిరుమలకు వస్తున్న భక్తుల ఫోన్ నెంబర్లను సేకరిస్తూ వాళ్లను ట్రాప్ చేస్తున్నకార్తీక్ ను టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.