సీఎంకే సవాల్ విసిరిన సినీ నటి..

సీఎంకే సవాల్ విసిరిన సినీ నటి.. సీఎంకే సవాల్ విసిరిన సినీ నటి..

Update: 2019-09-07 05:00 GMT

ప్రస్తుతం వాహనదారులకు వేస్తున్న భారీ జరిమాణాలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలో హోరెత్తుతున్నాయి. భారీ ఫైన్ లు వేసేముందు రోడ్లు సరిగా ఉండాలని సూచిస్తున్నారు. సినీ నటి సోనుగౌడ కూడా ఈ ఫైన్ లపై మండిపడుతున్నారు. ఈ విషయంలో కర్ణాటక సీఎం యడియూరప్పకు సవాల్‌ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లు ఉండాలని సూచించారు. శుక్రవారం తన ట్విట్టర్ లో ఈ విషయంపై ట్వీట్‌ చేశారు.

జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరుతూ.. ఒక బైకుదారుడు రోడ్డుపై పడుతున్న అవస్థను ఫొటో తీసి ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్‌ ఫోన్‌ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ సవాల్ సీఎం యడియూరప్పకు విసిరారు. కాగా గతంలో కూడా మత్స్య కన్య వేషంలో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారనే. 

Tags:    

Similar News