కొడిగుడ్డు కోసం వివాహేతర సంబంధం.. ప్రియుడితో వివాహిత పరార్‌

Update: 2019-10-27 09:09 GMT
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధాలకి వేరువేరు కారణాలు ఉంటాయి. కానీ ఓ మహిళ మాత్రం కొడుగుడ్డు కోసం వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సమాధానం విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోరక్‌పూర్ జిల్లా కాంపర్‌గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా అక్కడ పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో తన భార్యను పోషిస్తున్నాడు ఓ ఇంటి యజమాని... కానీ అతని భార్య మాత్రం మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ క్రమంలో ఇంటి నుండి పారిపోయింది. దీనితో భర్త పోలీసులకు కంప్లేంట్ ఇవ్వడంతో భార్య తిరిగి వచ్చింది. దీనితో పోలీసులు ఎందుకిలా చేసావ్ అని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది ఆ ఇల్లాలు..

నా భర్త నాకు తినడానికి ప్రతిరోజు కోడిగుడ్లు కొని ఇవ్వడం లేదని అందుకే ఈ పని చేశానని చెప్పింది. దానకి తన భర్త సమాధానం ఇస్తూ నా ఆర్ధిక స్తోమత వల్లే ప్రతిరోజు గుడ్డు కొనివ్వలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పోలీసులు ఇద్దరికీ సర్ది చెప్పి పంపించారు. ఈ నేపధ్యంలో ఓ రోజు మళ్లీ ఇద్దరి మద్య కోడిగుడ్డు దగ్గర వాగ్వాదం జరిగింది. మళ్లీ తన భార్య తనకి కనిపించకుండా వెళ్ళిపోయింది. దీనితో చేసేది ఏమీ లేకా మళ్లీ పోలీసులకి ఫిర్యాదు చేసాడు ఆ భర్త.. అయితే తాన భార్యను ఆమె ప్రియుడు కోడిగుడ్డు ఆశ చూపి లోబరుచుకున్నాడని అతను తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోచు చేసుకొని ఆమె కోసం గాలిస్తున్నారు. 

Tags:    

Similar News